ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆటో రజనీ మూవీ టీమ్..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆటో రజనీ మూవీ టీమ్..!

Published on May 21, 2022 12:40 AM IST


శ్రీ మహాలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో నిర్మిస్తున్న హై ఓల్టేజ్ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆటో రజిని.

గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని ఎంపి నందిగాం సురేష్ అధ్వర్యంలో కలసి మూవీలోని కొన్ని సన్నివేశాలను చూపించి చిత్ర విశేషాలను వివరించి అయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో ఎంపీ నందిగాం సురేష్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం.

ఈ సినిమాకి సంబంధించి ఇటీవల ఓ భారీ యాక్షన్ షెడ్యూల్‌ను విజయవాడలో జరిపారు. ఈ షెడ్యూల్‌లో బాపట్ల ఎంపీ గౌరవ నందిగాం సురేష్.. హీరో హరి జొన్నలగడ్డ కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అధ్వర్యంలో 150 మంది డాన్సర్‌లతో ఓ పాటను చిత్రీకరించారు. జూన్ 10 నుంచి మరొక షెడ్యూల్‌ను విజయవాడలో జరుపనున్నారు. జూలై 10 నుంచి క్లైమాక్స్ సన్నివేశాలను నెల్లూరు కృష్ణ పట్నం పోర్ట్ లో జరుపుతారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ జొన్నలగడ్డ మాట్లాడుతూ మా ఆటోరజినీ సినిమా షూటింగ్ కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఏపీ ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఏపీ సీఎం జగన్ గారిని కలసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సినిమా షూటింగ్ లకు ఏపీ అనువైన ప్రదేశం. మంచి లొకేషన్స్ ఉన్నాయి. మా షూటింగ్ కి ఎక్కడ చిన్న అవాంతరం లేకుండా ఏపీ ప్రభుత్వం సహకరించింది అందుకు జగన్ గారినీ కలసి కృతజ్ఞతలు తెలిపాము. అలాగే నా మీద నమ్మకంతో మా హీరో హరి మీద అభిమానంతో ఈ సినిమాలో గౌరవ ఎంపీ శ్రీ నందిగాం సురేష్ అన్న ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఓ భారీ షెడ్యూల్‌ను విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర గౌరవ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్య సాధన దీక్ష చేసిన ప్రాంతంలో జరిపాము. ఈ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్య సన్నివేశాలతో పాటు ఎంపీ నందిగాం సురేష్ అన్న హీరో హరి కాంబినేషన్‌లో వచ్చే హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ నేతృత్వంలో షూట్ చేసాము. ఎంపీ నందిగాం సురేష్ అన్న అద్భుతంగా నటిస్తున్నారు. మొదటి సినిమానే అయిన ఎంతో మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ లాగా నటిస్తున్నారు. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ఫైట్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ గా వుంటుంది. అలాగే హీరో హరి ఇంటర్డిక్షన్ డైలాగ్స్ బాగా వచ్చాయి. షూటింగ్ కి సంబంధించి ప్రభుత్వ అధికారులు, పోలీస్ వారు ఎంతో సహకరించారు. ముఖ్యంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్న, ఎమ్మెల్యే కొడాలి నాని అన్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్న సహకారం మరువలేనిది. మాకు సహకరించిన ప్రభుత్వ అధికారులకు పోలీస్ శాఖ వారికి జీ వి ఎమ్ సి వారికి థాంక్స్. తదుపరి షెడ్యూల్‌ను జూన్ 10 నుంచి విజయవాడ కో ప్రారంభిస్తాము జూలై 10 నుంచి నెల్లూరు కృష్ణపట్నంలో క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేస్తాము. ఇప్పటివరకు 50 పర్సెంట్ సినిమా టాకీ పార్ట్ పూర్తి అయ్యింది అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు