వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశ్వక్ సేన్ కొత్త చిత్రం!

Published on Jul 31, 2022 11:05 pm IST

విశ్వక్ సేన్ హీరోగా విద్యా సాగర్ చింతా దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రాన్ని SVCC డిజిటల్ బ్యానర్ పై బాపినీడు బి. మరియు సుధీర్ ఈదర లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. 33 ఏళ్ల వయసు వచ్చిన అర్జున్ కుమార్ అల్లం పెళ్లి కోసం జరిగే ఈ కథా నేపథ్యం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. థియేటర్ల లో ఈ చిత్రం విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దం అయింది.

ఈ చిత్రం వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు జెమిని టీవీ లో ప్రసారం కానుంది. ఈ చిత్రం లో రుఖ్సర్ దిల్లాన్, రితీకా నాయక్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించడం జరిగింది. ఈ చిత్రానికి జే క్రిష్ సంగీతం అందించారు. థియేటర్ల లో ఆకట్టుకున్న ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :