“అశోకవనంలో అర్జున కళ్యాణం” డిజిటల్ ప్రీమియర్ కి రెడీ!

Published on May 27, 2022 12:25 pm IST

విశ్వక్ సేన్ హీరోగా విద్యా సాగర్ చింతా దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రం ను SVCC డిజిటల్ పతాకం పై బాపినీడు మరియు సుధీర్ ఈదర లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్దం అవుతోంది.

ఈ చిత్రం ఆహా వీడియో లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఈ చిత్రం జూన్ 3 నుండి ఈ చిత్రం ఆహా వీడియో లో ప్రసారం అవుతున్నట్లు తెలుస్తోంది. జయ్ క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రం లో రుఖ్సన్ దిల్లాన్ హీరోయిన్ గా నటించింది. థియేటర్ల లో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :