త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశ్వక్ సేన్ ‘అశోక వనంలో…’

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశ్వక్ సేన్ ‘అశోక వనంలో…’

Published on Jul 25, 2022 9:30 PM IST

విశ్వక్ సేన్ హీరోగా విద్యా సాగర్ చింతా దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అశోక వనంలో అర్జున కళ్యాణం. 33 ఏళ్ల బ్యాచిలర్ పెళ్లి కోసం వేరే ఊరు వెళ్లి లాక్ డౌన్ లో చిక్కుకొని ఫన్ అండ్ ఫీల్ గుడ్ లవ్ ను అందించిన చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను తాజాగా జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలో ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. SVCC డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జే క్రిష్ సంగీతం అందించారు. ఈ చిత్రం లో రుక్సర్ ధిల్లాన్, రితిక నాయక్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించడం జరిగింది. థియేటర్ల లో ప్రేక్షకులని, అభిమానులను అలరించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు