అవంతిక.. అంతరాత్మల కథ

avanthika

“ప్రతి మనిషిలో ఓ అంతరాత్మ ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం, అసూయ.. ఇలా. అంతరాత్మలో భావాలను వ్యక్తపరిచే ఇద్దరు వ్యక్తులు కలిసుంటూ వాళ్ళ భావాలతో జీవితం ఎలా సాగించారనేది కథాంశంతో రూపొందుతున్న చిత్రం “అవంతిక”. సీనియర్ నటుడు బాలాజీ తనయుడు రోహన్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. మనీషా కథానాయిక. గోపి కాకర్ల దర్శకుడు. సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉమ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరబాద్ లో జరింగంది. ముహూర్త కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాత కె.దామోదర ప్రసాద్(దాము) కెమెరా స్విచాన్ చేయగా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ ఇచ్చారు. బాలాజీ మాట్లాడుతూ.. “అవంతిక అంటే తేజస్సు అని అర్థం. మంచి మనసుతో తేజస్సు కల అమ్మాయి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తను సంతోషంగా ఉందా..? బాధపడుతుందా..? అనే కోణంలో సాగే ఆహ్లాదకరమైన చిత్రమిది. ఈ చిత్రంతో మా అబ్బాయి హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంద”న్నారు. ఆగష్టులో చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత ఉమ తెలిపారు. “ప్రేమకథ నేపధ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిద”ని దర్శకుడు గోపి కాకర్ల అన్నారు. కార్యక్రమంలో మనీషా, సంగీత దర్శకుడు భోలే, ఛాయాగ్రాహకుడు ఎస్.వి.శివారెడ్డి, విజువల్స్ ఎఫెక్ట్స్ పర్యవేక్షకుడు జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.