ఇండియాలో ఇండస్ట్రీ హిట్ గా “అవతార్ 2”.!

Published on Jan 10, 2023 7:01 am IST


గత ఏడాది పాన్ వరల్డ్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “అవతార్ 2”. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమరూన్ అద్భుత సృష్టి నుంచి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ అంచనాలతో విడుదల అయ్యి మాసివ్ ఓపెనింగ్స్ రాబట్టింది. మరి హాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యిన చిత్రాల్లో అవేంజెర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ కాగా మొదట్లో అవతార్ 2 దీన్ని క్రాస్ చేయడం కాస్త అనుమానం గానే మారింది.

కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం టోటల్ గ్రాస్ ని అవతార్ ది వే ఆఫ్ వాటర్ అయితే క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఎండ్ గేమ్ సినిమా ఇండియాలో గ్రాస్ ని లైఫ్ టైం లో అందుకోగా ఇప్పుడు ఫైనల్ గా అయితే ఈ మొత్తం వసూళ్ల ని అవతార్ 2 బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు అయితే అవతార్ 2 చిత్రం 450 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిందట. అలాగే ఎండ్ గేమ్ 440 కోట్ల మేర గ్రాస్ ని అందుకుంది. దీనితో ఫైనల్ గా హాలీవుడ్ నుంచి అయితే అవతార్ 2 ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :