గ్లోబల్ గా టాప్ 4కి వచ్చేసిన “అవతార్ 2”.!

గ్లోబల్ గా టాప్ 4కి వచ్చేసిన “అవతార్ 2”.!

Published on Jan 29, 2023 9:00 AM IST

వరల్డ్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “అవతార్ 2”. దర్శకుడు జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి నుంచి వచ్చిన ఈ చిత్రం అనుకున్నట్టుగానే అన్ని అంచనాలు అందుకొని వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. 2 బిలియన్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం అనుకున్నట్టే టార్గెట్ ని రీచ్ అయ్యిపోయి ఇప్పటికీ కూడా స్థిరంగా దూసుకెళ్తుంది.

దీనితో అవతార్ 2 ఇప్పుడు లాంగ్ రన్ తో ఆల్ టైం వరల్డ్ వైడ్ టాప్ 4 గ్రాసర్ గా వచ్చినట్టుగా హాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. లేటెస్ట్ గానే టాప్ లో ఉన్నటువంటి స్టార్ వార్స్ వసూళ్ళని ఈ చిత్రం బ్రేక్ చేసి టాప్ 4 గ్రాసింగ్ చిత్రంగా నిలిచి ఇంకా మంచి వసూళ్లతో రాణిస్తుంది. దీనితో ఇక నెక్స్ట్ టాప్ 3లో ఉన్న టైటానిక్ దగ్గరకి వెళుతుంది అని చెప్పాలి. దీనితో మాత్రా జేమ్స్ కేమరూన్ ని తక్కువ అంచనా వెయ్యడానికి వీళ్లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు