“కేజీయఫ్ 2” రికార్డ్స్ బ్రేక్ చేసిన “అవతార్ 2”.!

“కేజీయఫ్ 2” రికార్డ్స్ బ్రేక్ చేసిన “అవతార్ 2”.!

Published on Dec 15, 2022 9:00 AM IST

ఈ ఒక్క ఏడాది లోనే ఇండియన్ సినిమా దగ్గర బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో వచ్చాయి. మరి దీనితో అయితే ఒకదాన్ని మించి ఓ సినిమా వస్తూ అలరించగా ఇక ఈ ఏడాదికి ఫైనల్ టచ్ గా వచ్చి రిలీజ్ కాబోతున్న సెన్సేషనల్ సినిమా “అవతార్ 2”. హాలీవుడ్ నుంచి మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ చిత్రం అయితే ఇండియా లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

పైగా ఇండియన్ మార్కెట్ లో కూడా ఎంతో కీలకంగా మారిన ఈ చిత్రం ఆల్రెడీ పలు పాన్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సెన్సేషనల్ స్టార్ట్ ని అందుకుంది. ఇక ఇండియా లో అయితే ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “కేజీయఫ్ 2” దాని మీద ఉన్న హైప్ లో మల్టీ ప్లెక్స్ లలో ఆల్ టైం రికార్డు మార్క్ టికెట్స్ ని బుకింగ్ చేసుకుంది.

మరి ఈ చిత్రానికి 4 లక్షల 11 వేలకి పైగా టికెట్స్ ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్ కాగా ఇప్పుడు అవతార్ 2 దీనిని బ్రేక్ చేసేసింది. మరి ఈ చిత్రానికి అయితే ఇండియా లో ఏకంగా 4 లక్షల 40 వేలకి పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. దీనితో ఇలా అవతార్ 2 ఇండియాలో కేజీయఫ్ 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు