తెలుగు రాష్ట్రాల్లో “అవతార్2” వసూళ్ళు!

తెలుగు రాష్ట్రాల్లో “అవతార్2” వసూళ్ళు!

Published on Dec 21, 2022 10:06 AM IST

ఎన్నో అంచనాల నడుమ థియేటర్ల లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అయిన భారీ చిత్రం అవతార్2. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం 2డి, 3డి లలో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, అయిదు రోజుల్లో 47 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది.

అవతార్ 2 ఇంగ్లీష్ సినిమా కాబట్టి ఇది చాలా పెద్దది. వర్కింగ్ డేస్ కావడం తో మార్నింగ్ షోలు నిదానంగా ప్రారంభమైనా, డే అంతా మంచి హోల్డ్ ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా నైజాం, ఏపీలోని ఏ సెంటర్లలో జేమ్స్ కేమరూన్ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు