ఇండియాలో మెల్లగా కంటిన్యూ అవుతున్న “అవతార్ 2” హవా.!

Published on Jan 3, 2023 7:07 am IST


గత ఏడాదికి పాన్ వరల్డ్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా ఉంది అంటే గత పడమూడేళ్లగా అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “అవతార్ 2” అనే చెప్పాలి. దర్శకుడు జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్ వండర్ భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. అయితే ఇండియాలో కూడా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం అయితే నెమ్మదిగా హవా అయితే కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రం ఎప్పుడో 300కోట్ల మార్కుని ఇండియా లో క్రాస్ చేయగా ఇప్పుడు 350 కోట్ల దిశగా వెళ్తుంది. మరి దీనితో ఇండియాలో ఫుల్ రన్ కి అయితే హాలీవుడ్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందో లేదో అనేది ఆసక్తి గా మారింది. మరి అవతార్ ది వే ఆఫ్ వాటర్ అయితే ఇండియాలో ఈ భారీ మైల్ స్టోన్ అందుకుంటుందో లేదో అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :