“అవతార్ 2”..మరింత హైప్ ఎక్కిస్తున్న కొత్త ప్రోమో.!

“అవతార్ 2”..మరింత హైప్ ఎక్కిస్తున్న కొత్త ప్రోమో.!

Published on Nov 25, 2022 12:00 PM IST

ప్రస్తుతం ప్రపంచ సినిమా అంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ చిత్రం “అవతార్ 2”. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ వండర్ అవతార్ కి కొనసాగింపుగా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” పేరిట ఇప్పుడు థియేటర్స్ లోకి రాబోతుంది.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఉన్న హైప్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన రెండో ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా మంచి అటెన్షన్ ని తెచ్చుకోగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సరికొత్త ప్రోమో కట్ అయితే మరింత కేజ్రీగా మారింది.

కంప్లీట్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ తో నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఈ ప్రోమో చూసాక ఆడియెన్స్ మరింత ఎగ్జైటింగ్ గా మారిపోతున్నారు. మరి ఈ ప్రోమో చూపించిన కొత్త యాక్షన్ బ్లాక్ లు అయితే మతి పోగొట్టేలా కూడా ఉన్నాయని చెప్పాలి. మొత్తానికి అయితే అవతార్ ఫీవర్ ముందు ముందు ఇంకా గట్టిగా మారేలా ఉందని చెప్పాలి.

అవతార్ కొత్త ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు