మాసివ్ రిలీజ్ తో “అవతార్ 2” వరల్డ్ వైడ్ స్క్రీన్స్.!

మాసివ్ రిలీజ్ తో “అవతార్ 2” వరల్డ్ వైడ్ స్క్రీన్స్.!

Published on Dec 14, 2022 1:04 PM IST

ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ అయితే ఈ డిసెంబర్ 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం విషయంలో ఎప్పుడు నుంచో భారీ హైప్ నెలకొనగా ఈ సినిమా డెఫినెట్ గా అయితే గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది అని ఎలాగో అందరికీ తెలిసిందే.

మరి ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏ రేంజ్ లో రిలీజ్ కాబోతుందో తెలుస్తుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా అయితే 55 వేల స్క్రీన్స్ లో మాసివ్ రిలీజ్ అవుతుందట. మరి దీనితో అయితే ఇది వరల్డ్ హైయెస్ట్ రిలీజ్ లో ఆల్ టైం రికార్డు గా కూడా తెలుస్తుంది. దీనికి ముందు అయితే హైయెస్ట్ రిలీస్ రికార్డు గా అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం నిలిచింది. దానిని ఇప్పుడు అవతార్ 2 బ్రేక్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు