తెలుగు రాష్ట్రాల్లో “అవతార్2” మూడు రోజుల వసూళ్లు!

తెలుగు రాష్ట్రాల్లో “అవతార్2” మూడు రోజుల వసూళ్లు!

Published on Dec 19, 2022 9:01 PM IST

అవతార్ 2 శుక్రవారం గ్రాండ్ గా థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం రిలీజై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అద్బుతమైన వసూళ్లను రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ అప్డేట్.

అవతార్ 2 ఇంగ్లీష్ సినిమా కాబట్టి ఇది చాలా పెద్దది. సోమవారం కూడా ఆక్యుపెన్సీ బాగానే ఉంది. మార్నింగ్ షోలు నిదానంగా ప్రారంభమైనా, మధ్యాహ్నం షోలు మంచి ఆక్యుపెన్సీతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నైజాం, ఏపీలోని ఏ సెంటర్లలో జేమ్స్ కేమరూన్ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు