“అవతార్ 2” కొత్త ట్రైలర్ రెడీ.. కానీ..!

“అవతార్ 2” కొత్త ట్రైలర్ రెడీ.. కానీ..!

Published on Nov 22, 2022 7:02 AM IST

ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “అవతార్ 2”. హాలీవుడ్ టాప్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి లలో అవతార్ కూడా ఒకటి కాగా ఈ చిత్రాల్లో రెండో సినిమా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” ప్రపంచ వ్యాప్తంగా ఈ డిసెంబర్ విడుదల కి సిద్ధంగా ఉంది. ఇక ఈ అవైటెడ్ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అయితే మరిన్ని అంచనాలు పెంచగా ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం వెనకడుగు వెయ్యట్లేదు.

ఆల్రెడీ సరికొత్త పోస్టర్ లు రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు కొత్త ట్రైలర్ ని కూడా లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ ట్రైలర్ ముందులా యూట్యూబ్ కానీ ఏ సోషల్ మీడియాలో కానీ రిలీజ్ చెయ్యట్లేదట ఈరోజు రాత్రి జరుగుతున్న ఫూట్ బాల్ మ్యాచ్ సందర్భంగా ఎక్స్ క్లూజివ్ గా ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ ఈ ఎస్ పి ఎన్ ద్వారా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే దీనిని నెక్స్ట్ ఇతర మాధ్యమాల్లో కూడా రిలీజ్ చేస్తారని మరింత మంది ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ఈ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా 120 కి పైగా భాషల్లో విడుదల కానుండగా 3D, ఐమాక్స్ వెర్షన్ లలో ప్రత్యేకంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు