లేటెస్ట్ : మరిన్ని అంచనాలు పెంచేస్తున్న “అవతార్ 2” కొత్త ట్రైలర్.!

లేటెస్ట్ : మరిన్ని అంచనాలు పెంచేస్తున్న “అవతార్ 2” కొత్త ట్రైలర్.!

Published on Nov 22, 2022 8:59 AM IST

ప్రస్తుతం పాన్ వరల్డ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అవతార్ 2” పై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ విజువల్ చిత్రం నుంచి అయితే మేకర్స్ నిన్ననే సరికొత్త ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ క్రేజీ ట్రైలర్ ని యూఎస్ టైం లో ఈరోజు సోమవారం రాత్రి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయగా మరి ఇప్పుడు ఈ ఎస్ పి ఎన్ తో పాటుగా గ్లోబల్ గా కూడా ఈ కొత్త ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ఇక ఈ అవైటెడ్ చిత్రం కొత్త ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. దర్శకుడు జేమ్స్ కేమరూన్ గత ట్రైలర్ లో ఎమోషన్స్ మరియు యాక్షన్ ని బ్యాలన్స్ గా చూపించగా ఈసారి మాత్రం మరింత స్థాయిలో యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో చూపించారు.

మరిన్ని కొత్త విజువల్స్ ని చూపించడమే కాకుండా తమ తెగని కాపాడుకునే క్రమంలో చూపించిన యుద్ధ సన్నివేశాలు వెంట్రుకలు నిక్కపొడుకునేలా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా థియేటర్స్ లో అయితే ఈ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇస్తాయని డెఫినెట్ గా చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఈ కొత్త ట్రైలర్ తో అంచనాలు మరింత స్థాయిలో పెరిగాయి. ఇక ఈ డిసెంబర్ 16న బాక్సాఫీస్ బ్లాస్ట్ ఎలా ఉండనుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు