ఐమాక్స్ లలో “అవతార్ 2” రికార్డు స్థాయి రిలీజ్..!

ఐమాక్స్ లలో “అవతార్ 2” రికార్డు స్థాయి రిలీజ్..!

Published on Dec 14, 2022 7:02 AM IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ మూవీ “అవతార్ ది వే ఆఫ్ వాటర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ని దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించగా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఐమాక్స్ స్క్రీన్ లను ప్రత్యేకంగా సిద్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనితో అయితే ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ వరల్డ్ వైడ్ రికార్డ్ స్థాయి స్క్రీన్స్ లో అవుతున్నట్లు గా తెలుస్తోంది.

ఇంతకీ ఈ చిత్రం ఎన్నో ఐమాక్స్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది అంటే కేవలం ఐమాక్స్ వెర్షన్ లోనే 4000 పై చిలుకు స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందట. ఇది వరల్డ్ సినిమా దగ్గరే అత్యధికం అని తెలుస్తోంది. మరి ఈ డిసెంబర్ 16 కి అయితే అవతార్ 2 మేనియా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు