ఇండియాలో భారీ సంఖ్యలో “అవతార్ 2” రిలీజ్.!

Published on Dec 15, 2022 8:00 am IST

చాలా ఏళ్ల తర్వాత పాన్ వరల్డ్ లెవెల్లో అనేక అంచనాలు నడుమ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “అవతార్ 2”. దర్శకుడు జేమ్స్ కేమరూన్ సెన్సేషనల్ హిట్ అవతార్ కి సీక్వెల్ గా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” పేరిట ఈ కొత్త చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మాసివ్ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మరి ఇండియన్ వెర్షన్ లో అయితే ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది.

ఆల్రెడీ వరల్డ్ వైడ్ ఈ చిత్రం ఆల్ టైం రికార్డు సంఖ్య లో రిలీజ్ అవుతుండగా ఇండియాలో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రం అయితే ఇండియాలో మొత్తం 6 భాషల్లో ఏకంగా 4000 పై చిలుకు స్క్రీన్స్ లో అయితే రిలీజ్ కాబోతుందట. మరి దీనితో అయితే భారీ ఓపెనింగ్స్ దక్కుతాయని ట్రేడ్ వర్గాల వారు అనుకుంటున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ వండర్ కి ఎలాంటి వెల్కమ్ దక్కుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :