వచ్చే ఏడాది డిసెంబర్ 16న “అవతార్-2”..!

Published on Oct 6, 2021 2:42 am IST


టెక్నాలజీని కన్నులకు కట్టినట్లుగా చూపించి సినీ చరిత్రలో ఓ చెరిగిపోని పేరు తెచ్చుకున్న అవతార్ సినిమాకు సీక్వెల్‌గా అవతార్-2 సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. జేంస్ కామెరూన్ దర్శకత్వంలో, 21 సెంచరీ ఫాక్స్ ఐఎన్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే “అవతార్2” సినిమాను 2022 డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనౌన్స్ తేదీనీ ప్రకటించింది. ఇవే కాకుండా వచ్చే ఏడాది విడుదలయ్యే మరిన్ని చిత్రాల విడుదల తేదీలను కూడా హాట్ స్టార్ ప్రకటించింది. థోర్ మే 6వ తేదిన విడుదల కానుండగా, బ్లాక్ ఫాంథర్ జూలై 8వ తేదిన, బ్లేడ్ అక్టోబర్ 7 వ తేది, ది మార్వెల్స్ నవంబర్ 11వ తేదిన విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం :