“అవతార్ 2” సెన్సార్ పూర్తి. రన్ టైం ఎంతంటే.!

“అవతార్ 2” సెన్సార్ పూర్తి. రన్ టైం ఎంతంటే.!

Published on Dec 9, 2022 7:00 PM IST


ఇప్పుడు వరల్డ్ బాక్సాఫీస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అవతార్ 2”. ప్రపంచ సినీ ప్రేక్షకులు అంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించారు. ఇక ఈ డిసెంబర్ 16న గ్రాండ్ గా 120 భాషలకి పైగా ఈ చిత్రం రిలీజ్ కానుండగా గత అవతార్ 1 లానే ఏఈ చిత్రం కూడా సుమారు 3 గంటల దగ్గర నిడివి తోనే ఉంటుంది అని పలు రూమర్స్ ఆమధ్య బయటకి వచ్చాయి.

అలాగే 3 గంటలు దాటే ఉంటుంది అని కూడా బజ్ వినిపించింది. ఇక ఇప్పుడు అయితే ఇండియన్ వెర్షన్ కి సంబంధించి రన్ టీమ్ ఎంత ఉంటుందో రివీల్ అయ్యింది. ఏ చిత్రం టోటల్ గా అయితే ఏకంగా 3 గంటల 12 నిముషాలు వచ్చేసింది అట. మరి మొత్తంగా అయితే థియేటర్స్ లో మరోసారి కొత్త ప్రపంచ ప్రయాణం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు