ఇండియాలో “అవతార్ 2” 2 రోజుల్లో సెన్సేషనల్ వసూళ్లు.!

ఇండియాలో “అవతార్ 2” 2 రోజుల్లో సెన్సేషనల్ వసూళ్లు.!

Published on Dec 18, 2022 1:00 PM IST

హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం అవతార్ 2 ఫైనల్ గా పదమూడేళ్ల తర్వాత ఈ డిసెంబర్ లో రిలీజ్ అయ్యి మరోసారి ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ని అయితే మరో లోకానికి తీసుకెళ్ళిపోయింది. దీనితో ఈ కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఎంతగానో నచ్చడంతో వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఈ మరోసారి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక మన ఇండియా లో కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కగా మరి రెండో రోజు కూడా ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.

ఈ రెండు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 102 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. దీనితో అయితే ఇండియాలో ఈ చిత్రం ముందు రోజుల్లో మరింత రేంజ్ లో అదరగొట్టనుంది అని చెప్పొచ్చు. మరి ఇండియా లో అయితే ఫైనల్ రన్ లో ఈ చిత్రం ఆల్ టైం హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు