“అవతార్ 2” టార్గెట్ గా “అవతార్ 1”..డీటెయిల్స్ ఇవే.!

“అవతార్ 2” టార్గెట్ గా “అవతార్ 1”..డీటెయిల్స్ ఇవే.!

Published on Nov 22, 2022 3:00 PM IST

పాన్ వరల్డ్ మూవీ లవర్స్ అంతా ఎంతో కేజ్రీగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ చిత్రం వసూళ్లు కోసం కూడా ట్రేడ్ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పదమూడేళ్ల కితమే అవతార్ సినిమా 2 బిలియన్ కి పైగా వసూళ్లతో భారీ రికార్డులు ప్రపంచ సినిమా దగ్గర నమోదు చేయగా ఇక ఇన్నేళ్ల తర్వాత వస్తున్న అవతార్ 2 ఎలాంటి వసూళ్లతో షేక్ చేస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇక అప్పట్లో సినిమా బిజినెస్ ఇప్పుడు ఈ సినిమా ఉన్న బిజినెస్ కి చాలా తేడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి అవతార్ 2 టార్గెట్ అయితే అవతార్ 1 కి వచ్చిన వసూళ్లు అట. అంటే 2 బిలియన్ డాలర్స్ కి పై వసూలు చేస్తే గాని వరల్డ్ సినిమా దగ్గర అవతార్ 2 గట్టెక్కదని తెలుస్తుంది. అయితే అవతార్ 2 పై ఉన్న అంచనాలతో ఈ 2 బిలియన్ డాలర్ వసూళ్లు కూడా చాలా సునాయాసం అనే ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్రం వసూళ్లు ఏ లెవెల్లో ఉంటాయో డెఫినెట్ గా చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు