“అవతార్ 2” కి అప్డేటెడ్ టైటిల్ పేరు వైరల్.!

Published on Apr 28, 2022 10:00 am IST


ఇప్పుడు ప్రపంచ సినిమా దగ్గర ఓ రేంజ్ లో వినిపిస్తున్న భారీ సినిమా పేరు “అవతార్”. హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన మొదటి సినిమా వరల్డ్ సినిమా దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో ఇప్పటికీ కూడా ఈ సినిమా రికార్డులు చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్నాయి.

మరి ఇదిలా ఉండగా నిన్ననే ఈ సినిమా రెండో భాగం నుంచి క్రేజీ గ్లింప్స్ ని భారీ స్థాయిలో స్పెషల్ ప్రీమియర్ గా వేశారు. దీనితో ఒక్కసారిగా మళ్ళీ ప్రపంచ సినీ ప్రేక్షకులు అవతార్ 2 నామం జపించారు. అయితే దీని తర్వాత కూడా మరిన్ని ఆసక్తికర అంశాలు బయటకి రాగా ఈ సినిమాకి దర్శకుడు అప్డేట్ చేసిన టైటిల్ పేరు ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ సినిమా దాదాపు 80 శాతం నీటిలోనే తెరకెక్కించబడింది అని ఒక రూమర్ ఉంది. మరి దానిని నిజం చేస్తూ ఈ చిత్రానికి “అవతార్ ది వే ఆఫ్ ది వాటర్” అనే టైటిల్ ని పెట్టినట్టుగా రివీల్ చేశారు. దీనితో ఈ క్రేజీ టైటిల్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా ఈ ట్రైలర్ ని మే 6న రిలీజ్ చేస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :