వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ టాప్ ప్లేస్ కి వచ్చిన “అవతార్”.!

Published on Mar 15, 2021 7:02 am IST

మొత్తం మన వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాసింగ్ సినిమా ఏది అంటే అది రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన “అవెంజర్స్ ఎండ్ గేమ్” అనే అంటారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని అవెంజర్స్ సిరీస్ లో చిట్ట చివరి సినిమా ఇది. గత 2019లో విడుదల కాబడిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ చోటా కూడా భారీ వసూళ్లను రాబట్టి వరల్డ్స్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే దీనికి ముందు ఏ సినిమా ఉండేదో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన భారీ విజువల్ వండర్ “అవతార్”. దీన్ని బీట్ చేసి 2.7902 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టగా అవతార్ రెండో స్థానానికి పడింది. అయితే ఈ రికార్డును బీట్ చెయ్యడానికి అవెంజర్స్ ఎండ్ గేమ్ కు దశాబ్దం పట్టగా దాన్ని మళ్లీ బీట్ చెయ్యడానికి అదే అవతార్ సినిమాకు రెండేళ్లు కూడా పట్టలేదు.

అదెలా అంటే రీసెంట్ గానే ఈ అవతార్ చిత్రాన్ని మళ్లీ చైనా దేశంలో రీ రిలీజ్ చెయ్యగా అక్కడ 3.22 మిలియన్ డాలర్లు వసూలు చేసింది దీనితో అవతార్ మార్క్ 2.7926 బిలియన్ కు చేరి మళ్లీ వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 స్థానానికి వచ్చేసింది.
ఎలాగో “అవతార్ 2” తో అన్ని రికార్డులు బడ్డలవుతాయి అనుకుంటే అది వచ్చేలోపే మొదటి సినిమానే బద్దలు కొట్టేసింది.. అయితే మార్వెల్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఎండ్ గేమ్ ను కనుక రీ రిలీజ్ చేస్తే ఇది కూడా తప్పకుండా నెంబర్ 1 కి వచ్చేస్తుంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం అవతార్ సృష్టించిన ప్రభంజనమే వేరు అని చెప్పాలి..

సంబంధిత సమాచారం :