“అవతార్” సిరీస్ పై సెన్సేషనల్ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

“అవతార్” సిరీస్ పై సెన్సేషనల్ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Published on Nov 8, 2022 8:03 AM IST


ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏకైక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. హాలీవుడ్ లో ఎన్నో వండర్స్ ని క్రియేట్ చేసిన దర్శకుడు జేమ్స్ కేమరూన్ స్టార్ట్ చేసిన ఈ సెన్సేషనల్ సిరీస్ హాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ రెడీగా ఉండగా దర్శకుడు అయితే రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే తాను ఎప్పుడో ఈ సిరీస్ లో మొత్తం 5 సినిమాలు ప్లాన్ చేసినట్టు ఎప్పుడో అనౌన్స్ చేసారు.

అయితే ఈ చిత్రాలపై లేటెస్ట్ గా కేమరూన్ సంచలన అనౌన్సమెంట్ ఇచ్చారు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న అవతార్ 2 చిత్రం ప్లాప్ అయితే కనుక ఇక నెక్స్ట్ పార్టులు 4,5 ఉండవని తెలిపారు. మరి ఇది షాకింగ్ డెసిషన్ అయినా ప్లాప్ అయితే మాత్రం తాను ఇలా అనుకుంటున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ భారీ చిత్రం అయితే ఈ డిసెంబర్ 16న రిలీజ్ అవుతుండగా 3డి, ఐమ్యాక్స్ వెర్షన్స్ లో గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు