1 బిలియన్ క్లబ్ లో “అవతార్ ది వే ఆఫ్ వాటర్”.!

1 బిలియన్ క్లబ్ లో “అవతార్ ది వే ఆఫ్ వాటర్”.!

Published on Dec 28, 2022 7:02 AM IST

హాలీవుడ్ సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ విజువల్ వండర్ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్” కోసం ప్రపంచ ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 2009లో వచ్చిన బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అవతార్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం కూడా మాసివ్ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది.

ఇక అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫామ్ చేసింది లేదు అనేది మాత్రం పక్కన పెడితే సినిమా ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ లో సగానికి రీచ్ అయ్యినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 2 బిలియన్ డాలర్లు టార్గెట్ తో రిలీజ్ కాగా ఇప్పుడు ఈ చిత్రం 1 బిలియన్ వసూళ్లు ఈ పది రోజుల్లో వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇది రికార్డ్ మార్కే అని చెప్పాలి. ఇంకా లాంగ్ రన్ అయితే సినిమాకి ఉంది. అందులో అనుకున్న టార్గెట్ ని చిత్రం రీచ్ అవుతుందో లేదో అని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తి గా చూస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు