తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన అవతార్2 ఆక్యుపెన్సీ!

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన అవతార్2 ఆక్యుపెన్సీ!

Published on Dec 23, 2022 6:46 PM IST

అవతార్2 భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ సినిమా కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో మెల్లగా పడిపోయాయి. తెలుగులో కూడా విడుదలైన ఈ చిత్రం గత వారం ఏ సెంటర్లలో కొంత ఆక్యుపెన్సీని సాధించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లోని కీలక ఏరియాల్లో కలెక్షన్లు పడిపోవడంతో ఇప్పుడు తెలుగు సినిమాలు పై చేయి సాధించాయి.

ధమాకా మరియు 18 పేజెస్ చిత్రాలు ఈరోజు విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అవతార్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచి హోల్డ్ ను కనబరుచుట కష్టమే. మరి రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు