మార్వెల్ సినీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ పేరుతో రానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 25న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది.
ఈసారి ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. IMAX, ఇన్ఫినిటీ విషన్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. పెద్ద స్క్రీన్లు, మెరుగైన విజువల్స్, అద్భుతమైన సౌండ్‌తో సినిమాను సరికొత్తగా ఎంజాయ్ చేయవచ్చు.
‘డూమ్స్‌డే’ ఎక్స్‌క్లూజివ్ లుక్ స్పెషల్ ఎట్రాక్షన్
ఈ రీ-రిలీజ్ వెర్షన్లో అభిమానుల కోసం ఓ అదిరిపోయే సర్ప్రైజ్ కూడా జోడించారు. మార్వెల్ నుంచి డిసెంబర్ 18న థియేటర్లలోకి రానున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను ఈ ‘ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ ప్రదర్శనలలో చూపించనున్నారు. దీంతో ఈ రీ-రిలీజ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
థానోస్ విధ్వంసం వల్ల విశ్వంలో సగం జనాభా కనుమరుగైన నేపథ్యంలో, మిగిలిన సూపర్ హీరోలు ఏకమై తమ వారిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ‘ఎండ్‌గేమ్’ కథ. కెవిన్ ఫైజ్ నిర్మాణంలో ఆంథోనీ రస్సో, జో రస్సో ద్వయం ఈ భారీ విజువల్ వండర్‌ను తెరకెక్కించారు. ఈ ఐకానిక్ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు ఇప్పుడే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
