విశ్వక్ సేన్ “ఓరి దేవుడా” నుండి అవుననవా సాంగ్ ప్రోమో రిలీజ్!

విశ్వక్ సేన్ “ఓరి దేవుడా” నుండి అవుననవా సాంగ్ ప్రోమో రిలీజ్!

Published on Sep 25, 2022 7:25 PM IST

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ రొమాంటిక్ ఫాంటసీ డ్రామాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం నుండి అవుననవా సాంగ్ ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం కి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ అవుననవా సాంగ్ కి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం జరిగింది.

ఈ ప్రోమో కి సంబంధించిన పూర్తి పాటను చిత్ర యూనిట్ సెప్టెంబర్ 27 న విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. అక్టోబర్ 21 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం తమిళంలో సూపర్‌హిట్ అయిన ఓ మై కడవులే చిత్రానికి అధికారిక రీమేక్. ఒరిజినల్‌ లో విజయ్ సేతుపతి పోషించిన దేవుడి పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిథిలా పార్కర్ కథానాయిక గా నటిస్తుంది. ఆశా భట్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు దీనిని PVP సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు