“రావణాసుర” నుంచి అవైటెడ్ బిగ్ అప్డేట్.!

Published on Mar 1, 2023 4:13 pm IST

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుధీర్ వర్మ తో చేస్తున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” కూడా ఒకటి. మరి ఈ చిత్రం నుంచి ఒకో అప్డేట్ కూడా మంచి ఆసక్తిని రేపుతూ వస్తుండగా మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ ని అయితే అందించారని చెప్పాలి. మొదట గ్లింప్స్ లో కూడా పెద్దగా డీటెయిల్స్ రివీల్ చేయని మేకర్స్ ఇప్పుడు సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా టీజర్ అయితే ఈ మార్చ్ 6న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనిపై రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఇక రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్ కనిపించనుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు ధమాకా సంగీత దర్శకుడు భీమ్స్ కూడా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అలాగే అభిషేక్ పిక్చర్స్ మరియు రవితేజ లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :