అవైటెడ్ “పొన్నియిన్ సెల్వన్ 2” డేట్ వచ్చేసింది.!

అవైటెడ్ “పొన్నియిన్ సెల్వన్ 2” డేట్ వచ్చేసింది.!

Published on Dec 28, 2022 4:21 PM IST

తమిళ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్ హీరోగా కార్తీ సహా ఐశ్వర్య రాయ్ మరియు త్రిషలు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్ 1”. దర్శకుడు ఇండియన్ సినిమా దగ్గర లెజెండరీ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన ఈ చిత్రం మొత్తం రెండు భాగాలుగా అయితే తెరకెక్కి మొదటి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యింది. అయితే తమిళ్ లో భారీ సక్సెస్ ని అందుకున్న ఈ చిత్రం అయితే ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ కి కూడా రెడీ అయ్యిపోయింది.

నిన్నే మేకర్స్ ఓ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా ఇప్పుడు చెప్పినట్టే దానిని అనౌన్స్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2023 లో ఏప్రిల్ ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నట్టు మాసివ్ అనౌన్సమెంట్ అందించారు. ఇక దీనితో అయితే తమిళ ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు