లేటెస్ట్..రజినీ “అన్నాత్తే” ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్?

Published on Sep 8, 2021 1:15 pm IST

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తన మోస్ట్ అవైటెడ్ చిత్రం “అన్నాత్తే” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోవచ్చిన ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కి ముహూర్తం కుదిరిందట.

మరి లేటెస్ట్ టాక్ ప్రకారం మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని వచ్చే సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయనున్నారని సమాచారం. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రజినీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా డి ఇమ్మాన్ సంగీతం ఇస్తున్నాడు.. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాని దీపావళి రేస్ లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యినట్టు టాక్.

సంబంధిత సమాచారం :