ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులర్ అయ్యిన పలు క్రేజీ సిరీస్ లలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ బోల్డ్ సిరీస్ ది బాయ్స్ కూడా ఒకటి. అయితే దీనికి ఆఖరి సీజన్ గా ఇప్పుడు వారానికి ఒకో ఎపిసోడ్ చొప్పున మేకర్స్ విడుదల చేస్తూ వస్తున్నారు. మొదటి వారం ట్రీట్ గా 2 ఎపిసోడ్స్ ని అయితే మేకర్స్ విడుదల చేసారు.
ఒరిజినల్ ఇంగ్లీష్ లోనే కాకుండా మన రీజనల్ భాషలు తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ సిరీస్ ఫ్యాన్స్ కి ఇవాళ్టి నుంచి కొన్ని వారాల పాటు నాన్ స్టాప్ ట్రీట్ అని చెప్పవచ్చు. సూపర్ హ్యూమన్ సూపర్ హీరోస్ అలాగే వారిని ఎదిరించే బాయ్స్ గ్యాంగ్ నడుమ పోటీ ఈ సిరీస్ ఫాలోవర్స్ ని కట్టిపడేస్తుంది. ఇలా మొత్తం 5వ సీజన్ ఇపుడు ముగింపుకి వచ్చేసింది. ఇక ఇది ఎలాంటి ట్రీట్ ని అందిస్తుందో చూడాలి.
