‘అ’ ఒకే జానర్ కు చెందిన సినిమా కాదట !

19th, December 2017 - 01:10:38 PM

హీరో నాని నిర్మాతగా మారి చేస్తున్న చిత్రం ‘అ!’. పేరుతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఈ సినిమా కంటెంట్ పరంగా కూడా అలానే ఉంటుందట. ఇలాంటి కథను ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూసి ఉండరని, అందుకే ఈ సినిమా జనాల్లోకి వెళ్లేందుకు స్టార్ నటీనటులు అవసరమని, తానే నిర్మాణ బాధ్యతల్ని భుజానకెత్తుకున్నారు నాని.

టైటిల్ లానే సినిమాలోని ప్రతి అంశం ఆశ్చర్యానికి గురిచేస్తుందని నాని అన్నారు. అంతేగాక ఈ సినిమా ఒక జానర్ కు మాత్రమే చెందినది కాదని, ఇందులో థ్రిల్లర్, హర్రర్, క్రైమ్, యాక్షన్, ఫిక్షన్ ఇలా దాదాపు 6, 7 రకాల ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పుకోచ్చారు. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వచ్చేఏడాది ఫిబ్రవరి 2న రిలీజ్ చేయనున్నారు.

కజ్జల అగర్వాల్, నిత్యా మీనన్, రెజినా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి వంటి వారు నటిస్తున్న ఈ చిత్రానికి రవితేజ, నాని వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.