త్వరలో ‘అ!’ టీజర్ విడుదల!

నిత్యా మీన‌న్‌, కాజ‌ల్‌, రెజీనా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, ఈషా రెబ్బా ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తోన్న సినిమా ‘అ!’. నాని నిర్మాతగా వ్యవహారిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. . ఈ చిత్రానికి సంబంధించి ఇటిటీవల విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

ప్రశాంత్ వర్మ అనే నూతన దర్శకుడు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ జనవరి 5 న సాయంత్రం విడుదల చేయబోతున్నారు. రవితేజ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్ లు కూడా ఈ సినిమాలో కీల పాత్రలు చేస్తున్నారు.