‘శ్యామ్ సింఘ రాయ్’కి హిందీలో భారీ డీల్ !

Published on Nov 22, 2021 1:00 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని దక్షిణ భారతీయ భాషలలో రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయాయి. ‘B4U’ ఛానెల్ ఈ సినిమా హిందీ హక్కులను 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది, ఇది హిందీలో నాని మార్కెట్ కంటే ఎక్కువ ఎమౌంట్.

ఈ సినిమా టీజర్ సృష్టించిన రికార్డ్స్ కి దక్కిన డీల్ ఇది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒకప్పుడు కలకత్తాలో ఆడవాళ్ళని దాసులుగా మార్చి వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకునేవారు ? అలాంటి అప్పటి నీచమైన ఆచార్య వ్యవహారాల పై ఒక జర్నలిస్ట్ (నాని) తిరగబడితే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది.

కాగా విభిన్నమైన కథాంశంతో రానున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్‌ చేస్తున్నాడు. అలాగే ముగ్గురు హీరోయిన్స్ సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More