‘బాహుబలి-2’ ట్రైలర్ రన్ టైమ్ ఎంతో తెలుసా !


జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి-2’ రిలీజ్ దగ్గరపడుతున్న కొద్ది ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపవుతూ వస్తోంది. అంతకంటే ముందు రేపు విడుదల కానున్న ట్రైలర్ కోసం అయితే అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. రెండవ భాగంలో పాత్రల స్వరూపాలు ఎలా ఉండబోతున్నాయి, కథ ఎలా నడుస్తుంది, రాజమౌళి ఏయే అద్భుతాలు క్రియేట్ చేశాడు అనే ఆసక్తికర ఊహలతో ట్రైలర్ పై భారీ స్థాయి క్రేజ్ నెలకొంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ట్రైలర్ ఊపిరి బిగబట్టి చూసేంత గొప్పగా ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే చిత్ర టీమ్ ట్రైలర్ కు సంబందించిన అన్ని పనులు పూర్తి చేసింది. తాజాగా ట్రైలర్ సెన్సార్ కార్యక్రమాలను కూడా ముగించుకుంది. సెన్సార్ బోర్డు జారీ చేసిన U/A సర్టిఫికెట్ ప్రకారం ఈ ట్రైలర్ యొక్క రన్ టైమ్ 2 నిముషాల 20 సెకన్లుగా ఉంది. రేపు 16వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ కానున్న ఈ ట్రైలర్ ఏపి, తెలంగాణాల్లోని సుమారు 200 థియేర్లలో ప్రదర్శితం కానుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు. మరి రాజమౌళి ట్రైలర్ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో రేపు చూడాలి.