డే 1 ఫుట్ ఫాల్స్ లో ‘బాహుబలి 2’ ని టచ్ కూడా చెయ్యలేదా!

dhurandhar 2 3

మళ్లీ చాలా కాలం తర్వాత ఇండియా వైడ్ గా ఓ సినిమా కోసం చర్చ నడుస్తుంది. అదే ధురంధర్ 2. అయితే ఇలాంటి సెన్సేషనల్ సినిమాలు ఎన్ని వచ్చినా ఆ లిస్ట్ లో మొదటిగా బాహుబలి 2 అనే టాలీవుడ్ సినిమా లేకుండా ఆ ప్రస్తావనే మొదలు కాదు. అయితే బాహుబలి 2 అనే సినిమా సెట్ చేసిన స్టాండర్డ్స్ కానీ, అంచనాలు కానీ అంతా ఇంతా కాదు. అలానే దాని తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ బాహుబలి 2 సెట్ చేసిన కొన్ని యునానిమాస్ రికార్డులు ఇంకా చెక్కు చెదరలేదు.

ఇలానే ఇండియా వైడ్ గా మొదటి రోజే ఏకంగా ఒక కోటి ఫుట్ ఫాల్స్ పడిన సినిమాగా బాహుబలి 2 కి సెన్సేషనల్ రికార్డ్ ఉంది. అలాంటి రికార్డ్ ని ఇప్పుడు ఎంతో హైప్ లో వచ్చిన ధురంధర్ 2 కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది అనే టాక్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఆ రేంజ్ లో ప్రభాస్, రాజమౌళిల బాహుబలి 2 భారతీయ సినిమా దగ్గర ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టుకుంది. ఇక ముందు రోజుల్లో ఈ చెక్కు చెదరని రికార్డ్ ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

Exit mobile version