తమిళనాట ప్రభంజనం సృష్టిస్తున్న ‘బాహుబలి’ !

30th, April 2017 - 11:07:15 AM


‘బాహుబలి-2’ చిత్రం తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఉత్తర భాషల్లో సైతం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలతో భాషా బేధం లేకుండా ప్రేక్షకులు సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో చిత్ర వసూళ్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తొలిరోజు ఉదయం షోలు రద్దవడంతో భారీ రికార్డులు మిస్సైనప్పటికీ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు దక్కని వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంటోంది.

తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శుక్ర, శనివారాలు కలిపి చిత్రం రూ. 20 కోట్ల వసూళ్లను రాబట్టింది. అలాగే చెన్నై నగరంలో రెండు రోజులకు తెలుగు, తమిళ్, హిందీ మూడు వెర్షన్లలో కలిపి రూ. 2. 05 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్న శనివారం మాత్రమే రూ. 1. 13 కోట్లు రాబట్టి సింగిల్ డే వసూళ్లలో రజనీ ‘కబాలి’ తర్వాతి స్థానంలో నిలబడింది.