నాలుగు రోజులకే నాలుగు మిలియన్లు దాటిన బాహుబలి !

27th, October 2016 - 05:29:29 PM

baahubali-2
ప్రేక్షకుల్లో రోజురోజుకూ ‘బాహుబలి 2’ ఫీవర్ ఎక్కువైపోతోంది. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనానికి బాహుబలికి సంబందించిన ప్రతి చిన్న విషయం పెద్ద సంచలనం అయిపోతోంది. తాజాగా చిత్ర టీమ్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అయితే మరీ సెన్సేషన్ అయ్యాయి. ఈ నెల 22న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో రాజమౌళి ఈ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన కాసేపటికే అది ట్విట్టర్ నేషనల్ ట్రేండింగ్ లో టాప్ పొజిషన్లోకి వెళ్ళింది. అలాగే యూట్యూబ్ లో ఈ మోషన్ పోస్టర్ కు ఇప్పటి వరకూ 4 మిళియన్ల వ్యూస్ దక్కాయి.

ఇలా కేవలం విడుదలైన నాలుగు రోజులకే ఒక మోషన్ పోస్టర్ నాలుగు మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం అనేది పెద్ద విశేషమనే చెప్పాలి. ఇకపోతే రాజమౌళి డిసెంబర్ 1 నాటికి చిత్ర షూటింగ్ మొత్తం ముగించి సినిమాకి అతి కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ అద్భుతాన్ని 2017 ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం మీదున్న అంచనాల కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరుగుతోంది. ప్రముఖ సంస్థలు భారీ మొత్తాన్ని వెచ్చించి సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి.