రూ.1500 కోట్ల క్లబ్ కు చేరువలో ‘బాహుబలి-2’ !


దర్శ ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం మూడో వారంలో కూడా పూర్తి స్థాయి హవా చూపిస్తోంది. ప్రదర్శింపబడుతున్న అన్ని చోట్ల దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోంది. మొదటి రెండు వారాల్లోనే ఇండియాలో రూ. 1020 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని ప్రస్తుతం 19 రోజులు గడిచేసరికి రూ. 1500 కోట్ల క్లబ్ కు చెరువులోకి వెళ్ళింది.

తాజా ట్రేడ్ లెక్కల ప్రకారం ఇండియాలో రూ. 1189 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం ఓవర్సీస్లో రూ. 261 కోట్ల షేర్ ను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా రూ. 1450 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి ఇంకొద్ది రోజుల్లోనే రూ. 1500 కోట్ల క్లబ్ కి చేరుకోనుంది. ఇలా మూడు వారాలు కూడా పూర్తిగా గడవకముందే ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ చిత్రం పూర్తి రన్లో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.