విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ‘బాహుబలి 2’ !

4th, October 2016 - 08:38:08 AM

baahubali
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్న చిత్రం ‘బాహుబలి 2’. బాహుబలి మొదటి పార్ట్ విడుదల రికార్డులు సృష్టిస్తే ఈ భాగం మాత్రం విడుదలకు ముందే ఊహించని రికార్డుల్ని సొంతం చేసుకుంటోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తెలుగు, తమిళ్, హిందీ, మళయాలం వేరేషన్ల ఓవర్సీస్ హక్కులని ‘గ్రేట్ ఇండియా ఫిలిమ్స్’ సంస్థ రూ. 45 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుక్కుందట. ఈ డీల్ తో ఇప్పటి వరకూ నార్త్ అమెరికా హక్కుల్లో అతి భారీ మొత్తం పలికిన చిత్రంగా ‘బాహుబలి 2’ నిలిచింది.

ఈ డీల్ లో హిందీ హక్కుల్ని మాత్రం కమీషన్ పద్దతిపైన మిగిలిన మూడు భాషల్ని పూర్తి హక్కులతో సంస్థ సొంతం చేసుకుందట. ఈ విషయంపై గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ గాని, రాజమౌళి టీమ్ గాని ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇకపోతే ఈ సంస్థ గతంలో ‘కిక్, ప్రేమమ్ (మలయాళం), రన్ రాజా రన్, పోకిరి, టెంపర్’ వంటి చిత్రాలను ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ప్రస్తుతం రాజమౌళి టీమ్ వర్చువల్ రియాలిటీ ట్రైలర్ కోసం కష్టపడుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.