‘బాహుబలి-2’ బిజినెస్ ఎంతో తెలుసా !

‘బాహుబలి-2’ బిజినెస్ ఎంతో తెలుసా !

Published on Mar 23, 2017 9:38 AM IST


‘బాహుబలి -ది కంక్లూజన్’.. ఈ పేరు వినగానే భారతీయ సినీ ప్రేక్షకులకు టక్కున ఏప్రిల్ 28వ తేదీ గుర్తుకొస్తుంది. అంత భారీ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇందుకు దర్శకుడు రాజమౌళి విజన్, నిర్మాతలు పాటించిన గొప్ప సాంకేతిక విలువలు, మొదటి భాగం సాధించిన విజయమే కారణమని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా చేసిన బిజినెస్ విషయానికొస్తే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం మొదటి భాగం ‘బాహుబలి – ది బిగినింగ్’ సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది. ఇందులో నిర్మాత షేర్ సుమారు. రూ. 250 కోట్లని తేలింది.

ఇక రెండవ భాగం బాహుబలి – 2 యొక్క థియేట్రికల్ రైట్స్, రూ.78 శాటిలైట్ రైట్స్, గేమ్స్, ఇతర హక్కులు అన్నీ కలుపుకుని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు సుమారు రూ. 400 నుండి రూ. 500 కోట్ల వరకు షేర్ దక్కుంతుదని అంచనా. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా విడుదలకు నెల ముందే బిజినెస్ భారీ స్థాయిలో జరిగి భారీ లాభాలు వచ్చినట్టు తెలిపారు. అలాగే సినిమా విడుదలై పెద్ద విజయం సాధించడం ఖాయమని, దాంతో హక్కులు కొన్నవారికి కూడా మంచి లాభాలు వస్తాయని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు