యూఎస్ బాక్సాఫీస్ జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన ‘బాహుబలి-2’ !


‘బాహుబలి-ది కంక్లూజన్’ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గురువారం ప్రదర్శించియాన్ ప్రీమియర్ షోలు, శుక్ర, శనివారాలతో కలిపి సుమారు 8.16 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ఆదివారం కూడా మంచి వసూళ్లను సాధించి 10. 13 మిలియన్ డాలర్లను అనగా రూ. 64 కోట్లకు రూపాయలను రాబట్టింది. దీంతో తాజాగా ప్రముఖ వెబ్సైట్ ప్రకటించిన యూఎస్ బాక్సాఫీస్ వీకెండ్ లిస్టులో మొదటి మూడు చిత్రాల్లో బాహుబలి-2 కూడా ఒకటిగా నిలిచింది.

ముందుగా ‘ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్’ 19. 3 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలవగా, 12 మిలియన్ డాలర్లతో ‘హౌ టూ బి ఏ లాటిన్ లవర్’ రెండవ స్థానంలో నిలిచింది. ఇలా ఒక తెలుగు సినిమా ఎన్నడూ లేని విధంగా వీకెండ్ కలెక్షన్ల పరంగా యూఎస్ బాక్సాఫీస్ జాబితాలో మూడవ స్థానంలో నిలవడమంటే పెద్ద విశేషమే మరి. ఇకపోతే బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ కాసుల వర్షం కురిపిస్తున్నారు.