ఓవర్సీస్ మార్కెట్ ను ఊపేస్తున్న ‘బాహుబలి’ !


‘బాహుబలి – ది కంక్లూజన్’ ప్రభంజనం కేవలం ఇండియాలో మాత్రమే గాక రిలీజైన ప్రతి చోట స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఉన్న ఓవర్సీస్ లో అయితే తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సందడే నెలకొంది. అక్కడి ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఆదరణతో చిత్రం సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ప్రీమియర్ షోలు, శుక్ర, శనివారాలతో కలుపుకుని ఈ చిత్రం సుమారు 8.16 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది.

ఈ మొత్తాన్ని ఇండియన్ కరెన్సీలో లెక్కగడితే దాదాపు రూ.52.4 కోట్లుగా తేలింది. ఈ లెక్కలతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి-2’ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. అంతేగాక గతంలో అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’ పేరిట ఉన్న మొత్తం కలెక్షన్స్ రికార్డ్ ను కూడా ఈ చిత్రం త్వరలోనే దాటేయనుంది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం యొక్క రెండు రోజుల గ్రాస్ ఇంతకుముందున్న అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేసింది.