మూవీ మేళాలో ‘బాహుబలి 2’ ఫస్ట్‌లుక్..!

Published on Oct 17, 2016 1:53 pm IST


ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’కి రెండో భాగమైన ‘బాహుబలి 2’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి మొదటి భాగానికి ఎన్నో రెట్లు మించేలా రెండో భాగం ఉండేలా సినిమా కోసం కష్టపడుతూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రమోషన్స్ విషయంలో ఎవ్వరూ చేయని ప్రమోషన్స్ బాహుబలి 2కి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్‌లుక్ లాంచ్‌తో ఈనెల 22న బాహుబలి టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది.

హీరో ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) పురస్కరించుకొని రాజమౌళి ఈ ఫస్ట్‌లుక్‌ను ప్లాన్ చేశారు. ఇక ఈ ఫస్ట్‌లుక్‌ను ప్రస్తుతం ముంబైలో వైభవంగా జరుగుతున్న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగమైన మూవీమేళా అనే ప్రోగ్రామ్‌లో ఈ ఫస్ట్‌లుక్‌ విడుదలవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి రాజమౌళితో సహా టీమ్ అంతా హాజరు కానున్నారు. అదే రోజున సాయంత్రం ఆన్‌లైన్లో ఫస్ట్‌లుక్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More