‘బాహుబలి-2’ నైజాం లైఫ్ టైమ్ కలెక్షన్లు ఎంతుండొచ్చంటే !


‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన వసూళ్లతో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్ల పై చిలుకు గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే వసూళ్ల పరంగా అగ్రగామిగా నిలిచింది. ఇక మాతృక భాషైన తెలుగులో కూడా కలెక్షన్ల పరంగా అన్ని రికార్డుల్ని కొల్లగొట్టిన ఈ చిత్రం కీలకమైన నైజాం ఏరియాలో ఊహకందని రీతిలో వసూళ్లను రాబడుతోంది.

మొదటి 10 రోజులకి గాను రూ. 49. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా రెండవ వారం గడిచే సరికి రూ. రూ. 54 నుండి 55 కోట్ల వరకు రాబడుతుందని, ఇక లైఫ్ టైమ్ వసూళ్ల విషయానికొస్తే రూ. 70 కోట్ల పైగానే వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక బాహుబలి పేరిట నమోదవనున్న ఈ రికార్డుని క్రాస్ చేయడానికి వేరే సినిమాలకి చాలా సమయం పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.