తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ మూడు రోజుల కలెక్షన్ల వివరాలు !


‘బాహుబలి-2’ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతోంది. మొదటి రోజు శుక్రవారం రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ సాదించిన ఈ చిత్రం శనివారం కూడా అదే జోరు కొనసాగించింది. పైగా నిన్న ఆదివారం సెలవు కావడంతో ఆ వసూళ్లు స్టడీగా కొనసాగాయి. తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న వివరాల ప్రకారం ఆదివారం ఈ చిత్రం సుమారు రూ. 16 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల షేర్ మొత్తం కలిపి రూ. 74. 30 కోట్లుగా ఉంది.

ఇక ఏరియల్ వారీగా వసూళ్ల వివరాలను చూస్తే మొదటి నుడ్ని నైజాం ఏరియాలో పట్టు చూపిస్తున్న బాహుబలి అక్కడ మూడు రోజులకు కలిపి రూ. 19 కోట్లు, సీడెడ్లో రూ. 12. 50 కోట్లు, నెల్లూరులో రూ. 3. 31 కోట్లు, గుంటూరు రూ. 8. 84 కోట్లు, కృష్ణాలో రూ. 5.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.72 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7. 51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9. 28 కోట్లు కలెక్ట్ చేసింది.