తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ వసూళ్ల సునామి !

30th, April 2017 - 03:09:20 PM


రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం తెలుగు సినీ కీర్తిని దేశవ్యాప్తం చేసింది. దేనితో తెలుగు ప్రేక్షకులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సినిమాపై ఎనలేని ఆదరణ చూపుతున్నారు. దీంతో సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా అందిన లెక్కల ప్రకారం ఈ చిత్రం శుక్ర, శనివారాల్లో ఏపి, తెలంగాణాల్లో రూ. 58.4 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇది ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని మొత్తంగా రికార్డులకెక్కింది.

ఏరియల వారీగా లెక్కలు చూసుకుంటే సీడెడ్ లో రూ.8.90 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం నెల్లూరులో 2. 60 కోట్లు, గుంటూరులో రూ. 7.68 కోట్లు, కృష్ణలో రూ. 3. 97 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6. 78 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7. 29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6. 88 కోట్లు రాబట్టి నైజాంలో అత్యధికంగా రూ. 14. 3 కోట్లు కొల్లగొట్టింది. ఈ లెక్కలు ఈరోజు 30వ తేదీ, రేపు మే 1 సెలవు కావడంతో దాదాపుగా మొదటిరోజు స్థాయిలోనే కొనసాగే చాన్సులున్నాయి.