
జులై 10, 2015 తెలుగు సినీ ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజుగా నిలిచింది. దర్శకధీరుడి మూడేళ్ళ శ్రమకి ఫలితంగా విడుదలైన బాహుబలి విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో కేవలం నాలుగు రోజుల్లోనే సౌత్ టాప్ మూవీస్ జాబితాలో చోటు సంపాదించుకుంది.
ఇప్పుడు బాహుబలి త్వరలో జపాన్ లో విడుదలకానుందని సమాచారం. సౌత్ నుండి రజినీకాంత్ కి జపాన్ లో మంచి ఫ్యాన్స్ వుండడం, ఈగ, ఆమీర్ ఖాన్ పి.కె చిత్రాలు అక్కడ మంచి గుర్తింపుని తెచ్చుకోవడంతో ఈ సినిమా పై అక్కడ సైతం భారీ అంచనాలే ఏర్పడ్డాయి. చూద్దాం, బాహుబలి జపాన్ లో ఎటువంటి సునామీ సృష్టిస్తుందో…