లేటెస్ట్…”బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్” తెలుగు ట్రైలర్ రిలీజ్!

బాహుబలి చిత్రాలతో భారతీయ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి బిగినింగ్ కి ప్రీక్వెల్ ను బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరిట యానిమేటెడ్ సిరీస్ గా తెరకెక్కించారు మేకర్స్. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ లో ఈ యానిమేటెడ్ సిరీస్ మే 17 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. తాజాగా ఈ సిరీస్ కి సంబందించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్.

ట్రైలర్ లో పలు ఆసక్తికర పాత్రలు నిండి ఉన్నాయి. బాహుబలి, భళ్లాల దేవ వీరోచిత ప్రదర్శనలు ఉన్నాయి. రక్తదేవ్ అనే పాత్ర తో ట్రైలర్ మరింత ఆసక్తికరం గా ఉంది. ది లెజండ్ ఆఫ్ హనుమాన్ ను తెరకెక్కించిన కంగ్ మరియు నవీన్ జాన్ లు ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా, రాజమౌళి, శోభు యార్లగడ్డ, దేవరాజన్ లు నిర్మించారు. ఈ సిరీస్ తెలుగు లో కూడా అందుబాటులోకి రానుండటం తో బాహుబలి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version